Nellore: నెల్లూరులో స్థానిక ఎన్నికల సన్నద్ధతపై ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సమీక్ష!
Nellore: నెల్లూరులో స్థానిక ఎన్నికల సన్నద్ధతపై ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. సున్నిత ప్రాంతాలపై నిఘా పెట్టాలని ఆదేశం.
Nellore: నెల్లూరులో స్థానిక ఎన్నికల సన్నద్ధతపై ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సమీక్ష!
నెల్లూరు: SPSR నెల్లూరు జిల్లాలో స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ZPTC) ఎన్నికలు ఒకే దశలో, గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్న నేపథ్యంలోనిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సమగ్ర కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు, అవాంఛనీయ సంఘటనల నివారణకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు.
ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సౌత్ కోస్టల్ రేంజ్, గుంటూరు సర్వ శ్రేష్ట త్రిపాఠి, ఆధ్వర్యంలో ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు... ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ పోలీసు సబ్ డివిజన్లకు చెందిన అధికారులు పాల్గొని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, పోలీసు బందోబస్తు, ముందస్తు చర్యలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.
జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఐదు సబ్ డివిజన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వుంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక వ్యక్తులపై నిఘా – చట్టప్రకారం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పటిష్టమైన బందోబస్తు – సమన్వయంతో విధుల నిర్వహణ కొనసాగించాలని అధికారులకు సూచించారు.
ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు.. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా చేసుకొని పనిచేయాలని సూచించారు... ఈ సమీక్ష సమావేశంలో IGP సర్వశ్రేష్ఠ త్రిపాటితో పాటు,జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల,అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సి.హెచ్. సౌజన్య, అడిషనల్ ఎస్. పి AR అప్పారావు, నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు,కావలి DSP V.V.రమణ కుమార్,జిల్లాలోని వివిధ సబ్ డివిజన్ల పోలీసు అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




