Nellore: ఘనంగా హోటల్ రేష్మ 9వ వార్షికోత్సవం: నెల్లూరులో వేడుకలు

Nellore: నెల్లూరు మహాత్మా గాంధీ నగర్‌లో హోటల్ రేష్మ 9వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు; అధినేత షేక్ గౌస్‌‌కు టీడీపీ నేత బూడిద పురుషోత్తం శుభాకాంక్షలు తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 5 Oct 2026 5:52 PM IST
Nellore
X

Nellore: ఘనంగా హోటల్ రేష్మ 9వ వార్షికోత్సవం: నెల్లూరులో వేడుకలు

Nellore: నెల్లూరు నగరంలోని స్థానిక మహాత్మా గాంధీ నగర్ ప్రాంతంలో హోటల్ రేష్మ తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్ రేష్మ బిర్యానీ అధినేత షేక్ గౌస్ కేక్ కట్ చేసి బంధుమిత్రులకు పంపిణీ చేశారు.

ఈ వార్షికోత్సవ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు బూడిద పురుషోత్తంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ గౌస్ కు తమ శుభాకాంక్షలు తెలియజేసి హోటల్ రేష్మ మరింత అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

టిడిపి నాయకులు బూడిద పురుషోత్తం మాట్లాడుతూ హోటల్ రంగంలో హోటల్ రేష్మ సరికొత్త వరవడిని సృష్టించిందన్నారు. బిర్యానీలో సరికొత్త రుచులతో సాధారణ మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి ఉన్నత స్థాయి వరకు అందరి మన్ననలు పొందిందన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచాను కాల్చారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE