Nellore: 54వ డివిజన్లో హోరెత్తించిన వైఎస్సార్సీపీ ప్రచారం!
Nellore: నెల్లూరు 54వ డివిజన్ పరిధిలో వైఎస్సార్సీపీ హోరెత్తించే ప్రచారం. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆనం విజయకుమార్ రెడ్డి, షబానా పర్వీన్లను గెలిపించాలని విజ్ఞప్తి.
Nellore: 54వ డివిజన్లో హోరెత్తించిన వైఎస్సార్సీపీ ప్రచారం!
నెల్లూరు: నెల్లూరు 54వ డివిజన్ రామయ్య బడి, రాజాగారి వీధి, అలంకార్ సెంటర్ ప్రాంతాల్లో .. వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , వైసీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి , 54వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి షబానా పర్వీన్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నవంబర్ 1న జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో..ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి..నెల్లూరు నగర మేయర్ గా.. ఆనం విజయ్ కుమార్ రెడ్డిని, 54వ డివిజన్ కార్పొరేటర్ గా షబానా పర్వీన్ ని గెలిపించాలని కోరారు.
సందర్భంగా జరిగిన రోడ్ షోలో..అభ్యర్థులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తును ప్రదర్శిస్తూ.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.*
నెల్లూరు నగర కార్పొరేషన్ లో దొంగలు పడ్డారని.. ప్రస్తుతం కార్పొరేషన్ దోపిడీదారులకు అడ్డాగా మారిపోయిందని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేషన్ ద్వారా ప్రజలకు అందాల్సిన సేవల్లో.. తీవ్ర జాప్యం తలెత్తడంతో పాటు కొని సేవలు పూర్తిగా.. కనుమరుగైపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. అధికార పార్టీపై ధ్వజమెత్తారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. కార్పొరేషన్ లో.. ప్రజలకు పారదర్శకమైన సేవలను తీసుకురావడంతో పాటుగా .. ఇప్పుడున్న అనాలోచిత.. విధానాలను కట్టిపెట్టి.. ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి సులబతరం చేస్తామని తెలిపారు.. కార్పొరేషన్ లో నిస్వార్థ పాలనకు ప్రజలు శ్రీకారం చుడుతూ .. నవంబర్ 1న జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి.. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




