Nellore: నామినేషన్ పత్రాలు చించడం సిగ్గుచేటు: కాకాణి గోవర్ధన్!
Nellore: నామినేషన్ పత్రాలు చించివేస్తూ నెల్లూరులో కూటమి ప్రభుత్వం వికృత పోకడలకు తెరతీసిందని, ఏకపక్ష అధికారులపై ప్రైవేటు కేసులు వేస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.
Nellore: నామినేషన్ పత్రాలు చించడం సిగ్గుచేటు: కాకాణి గోవర్ధన్!
నెల్లూరు: నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు... ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం కనీసం నామినేషన్లు వేసేందుకు కూడా వైసీపీ అభ్యర్థులకు అవకాశం కల్పించలేదని...నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని వికృత సంప్రదాయానికి తెరలేపారన్నారు.
అభ్యర్థి చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను చించి వేయడం సభ్య సమాజం తలదించుకుటుందని. జిల్లా అధికార యంత్రాగం సహకారంతో వైసిపి అభ్యర్థులు 3 వ రోజు నామినేషన్లు వేశారని తెలిపారు. వైసీపీ కార్యకర్తల పై దాడులు చేస్తుంటే పోలీసులు దగ్గర ఉండి చోద్యం చూస్తున్నారన్నారు.
గూడూరు నియోజకవర్గం లో టీడీపీ కి బలం లేదు కాబట్టి నామినేషన్లు అడ్డుకున్నారని ఆరోపించారు...నామినేషన్లు అడ్డుకొని ఏకగ్రీవాలను చేసుకోవాలని కుట్ర పన్నారని ఎద్దేవా చేశారు.
వైసీపీ కార్యకర్తల పై సంఘవిద్రోహ శక్తులు దాడికి పాల్పడ్డాయని. మా కార్యకర్తలపై దాడికి పాల్పడిన ఏ ఒక్కడిని విడిచి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి అతిక్రమించిన అధికారులపై ప్రైవేటు కేసులు వేస్తామని.
స్కూటీని, పోలింగ్ లలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు...నామినేషన్ లు అడ్డుకోవడంతో రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఓటమిని ఒప్పుకున్నట్లేనని. అన్నిరకాలుగా అడ్డుకున్నా వైసీపీ శ్రేణులు ధైర్యంగా నిలబడ్డారు.. వారికి మేము అండగా నిలుస్తామని అన్నారు.




