Vidavaluru: సాగునీటిపై స్పష్టతనివ్వాలి: నెల్లూరు రైతుల డిమాండ్

Vidavaluru: నెల్లూరు జిల్లాలో సాగునీటి విడుదలపై మంత్రులు ఆనం, సోమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఐఏబీ సమావేశం నిర్వహించి స్పష్టతనివ్వాలని రైతులు కోరారు.

K.Sriharibabu, Kovur (Nellore Dsct)
Published on: 11 Nov 2026 3:36 PM IST
Vidavaluru
X

Vidavaluru: సాగునీటిపై స్పష్టతనివ్వాలి: నెల్లూరు రైతుల డిమాండ్

Vidavaluru: విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామంలో కలిగిరి రిజర్వాయర్ కింద ఉన్న ,కొడవలూరు ,విడవలూరు ,దగదర్తి రైతులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంగం నాయకుడు పోలిరెడ్డి అశోక్ రెడ్డి మాట్లాడుతూ ,వ్యవసాయ ఆధారిత జిల్లా ఐన నెల్లూరు జిల్లా రైతులు పంట వేసుకోవాలా వద్దా అనే అయోమయ పరిస్థితుల్లో ఉన్నారని ,జిల్లా రైతాంగం పై పూర్తిగా అవగాహన ఉన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు క్లారిటీ ఇవ్వాలని అన్నారు.

గతంలో 2020,21 లో సాగునీరు ఉన్నప్పటికీ ధాన్యం ధర కారణంగా రైతులు రెండు సంవత్సరాలు పంట వేయలేదని, మొన్న రెండవ పంట సమయంలో ధాన్యం ధర ఇరవై ఐదు వేలనుండి ముప్పైవేల వరకు ధర రావడంతో జిల్లాలో రైతులు పంట వేయడానికి ఉత్సాహంగా ఉన్నారని, ఐతే సాగునీటి ఇబ్బందుల కారణంగా రైతులు పంట వేయాలా వద్దా అన్న సందేహంలో ఉన్నారని, జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఐఏబీ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకుని రైతులకు క్లారిటీ ఇవ్వాలని అన్నారు .ఇప్పటికే మోటార్లు కింద , చెరువుల కింద ఉన్న రైతులు నార్లు పోయడం ప్రారంభించారని అన్నారు.

నవంబర్ చివరికల్లా సాగునీరు ఇస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందని ,డిసెంబర్ల్ నెలలో ఇస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు . జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెపితేనే రైతులు వింటారని ,విద్యుత్ శాఖ అధికారులు , వ్యవసాయ శాఖ అధికారులు చెపితే రైతులు న్నారని, కావున నాయకులు త్వరగా ఒక ప్రకటన విడుదల చేయాలనీ కోరారు. ఈ సమావేశంలో కొడవలూరు ,విడవలూరు ,దగదర్తి మండలాల రైతులు,స్థానిక రైతులు పాల్గొన్నారు.

K.Sriharibabu, Kovur (Nellore Dsct)

K.Sriharibabu, Kovur (Nellore Dsct)