Nellore: నెల్లూరు మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్.. అభిమానుల పాలాభిషేకం

Nellore: నెల్లూరు మేయర్‌గా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా రామలింగాపురం ఫ్లైఓవర్‌పై ఫ్లెక్సీ ఏర్పాటు చేసి పాలాభిషేకం చేసిన అభిమానులు.

A Praveen, Nellore
Published on: 23 Nov 2026 4:43 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్.. అభిమానుల పాలాభిషేకం

నెల్లూరు: నెల్లూరు నగర మేయర్‌గా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అభిమానులు తమ ఆనందాన్ని వినూత్న రీతిలో వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామలింగాపురం అండర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రూప్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి, పూలతో అభిషేకం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో అష్ఫాక్, చంద్రన్న, షబ్దర్, ఇర్షాద్, శుభాని తదితరులు పాల్గొన్నారు. రూప్ కుమార్ యాదవ్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభిమానులు ఇలా ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించి తమ ఆనందాన్ని, అభిమానాన్ని వ్యక్తం చేశారు.

A Praveen, Nellore

A Praveen, Nellore