Nellore: స్థానిక ఎన్నికల దౌర్జన్యాలపై SEC విచారణ జరపాలి కాకాణి!

Nellore: స్థానిక ఎన్నికల్లో కూటమి అక్రమాలపై SEC విచారణ చేయాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్. ఆధారాలు సమర్పించామని, న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని హెచ్చరిక.

V. Narasimhulu, Nellore
Published on: 27 Oct 2026 9:35 PM IST
Nellore
X

Nellore: స్థానిక ఎన్నికల దౌర్జన్యాలపై SEC విచారణ జరపాలి కాకాణి!

నెల్లూరు: అత్యంత హింసాత్మకంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు, ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులే, ఎస్ఈసీకి మేం ఇప్పటికే అన్ని ఆధారాలు సమర్పించాం. వీటిపై విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయని అన్నారు నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ...

ప్రభుత్వం చెప్పుచేతల్లో పనిచేస్తున్న ఎస్ఈసీ, వ్యవస్థల మీద మాకు పూర్తిగా నమ్మకం పోయిందని, మీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదని, అక్రమాలపై న్యాయపోరాటం కొనసాగిస్తామని చెప్పారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పోలీసుల సాయంతో చేసిన దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఆధారాలు సమర్పించామని, వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటికి వస్తాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఎస్ఈసీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిందని, అందుకే తాము న్యాయస్థానాల్ని ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ఈ దాడులు, బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడబోదని, న్యాయస్థానాల్లోనే దీనిపై తేల్చుకుంటామని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore