Nellore: నెల్లూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సమావేశం!
Nellore: నెల్లూరులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్వో విజయ్ కుమార్ సమావేశం:ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) పురోగతిపై సమగ్ర సమీక్ష.
Nellore: నెల్లూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సమావేశం!
నెల్లూరు: సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించి గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారి (DRO) విజయ్ కుమార్ 24.09.2026న నెల్లూరులోని నెల్లూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం నందు నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR–2026) ప్రక్రియలో ఇప్పటివరకు జరిగిన పురోగతి, చేపట్టిన కార్యక్రమాలు, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు DRO విజయ్ కుమార్ వివరించారు
SIR ప్రక్రియలో భాగంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై అధికారులు వివరాలు అందించగా, రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు, అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, iTDP నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు షేక్ రసూల్ పాల్గొన్నారు.




