Nellore: వాత్సల్య ఆశ్రమానికి రూ. 1.25 లక్షల ఆర్థిక విరాళం అందజేత

Nellore: నెల్లూరు వాత్సల్య ఆశ్రమ పిల్లల భవిష్యత్తు కోసం రూ. 1.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రముఖులు బచ్చు వీరాస్వామి, పబ్బిశెట్టి చంద్ర అందజేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 2 Oct 2026 7:15 PM IST
Nellore
X

Nellore: వాత్సల్య ఆశ్రమానికి రూ. 1.25 లక్షల ఆర్థిక విరాళం అందజేత

నెల్లూరు: నెల్లూరు వనంతోపు సెంటర్ జనహిత వాత్సల్య చిన్నారుల వృద్ధుల ఆశ్రమం నందు జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీ వాసవి మాత దేవస్థానం ప్రెసిడెంట్, సీనియర్ రొటీరియన్ మరియు కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చు వీరాస్వామి ఆశ్రమం నిర్వాహకులు ఆర్గనైజింగ్ సెక్రటరీ జివి సాంబశివరావు కి లక్ష రూపాయలు అందజేయడం జరిగింది, రొటీరియన్ పబ్బిశెట్టి చంద్ర గారు 25 వేల రూపాయలు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా బచ్చు వీరస్వామి మాట్లాడుతూ.. గత నెల సెప్టెంబర్ 13వ తేదీ తన పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమాన్ని సందర్శించి అన్ని రంగాల్లో పిల్లలను గొప్పగా తీర్చిదిద్దే విధానాన్ని గమనించి 50,000 అందజేయడం జరిగిందని, ప్రభుత్వ కార్పోరేట్ స్కూళ్లలో విద్యకే ప్రాధాన్యమిస్తున్న రోజుల్లో తల్లి తండ్రి లేని బిడ్డలను గొప్పగా తీర్చిదిద్దుతూ వాత్సల్య నుండి ఐఐటి, ఎన్ఐటి స్థాయికి వెళ్లే విధంగా తీర్చిదిద్దడం వీటన్నింటితో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు భగవద్గీత రామాయణం మహాభారతం ప్రతి ఒక్క దానిలో నిష్ణాతులుగా తయారుచేస్తున్నారు.

అని ఈ సందర్భంగా ఆశ్రమ పిల్లల కొరకు మరికొంత సహాయం చేయాలని భావించి లక్ష రూపాయలు ఈరోజు అందజేయడం జరిగిందని, అదేవిధంగా కావలి రోటరీ క్లబ్ నుండి రోటేరియన్ పబ్బిశెట్టి చంద్ర గారు 25000 రూపాయలు ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగింది.

అని, మహాత్మా గాంధీ చూపిన సత్యం అహింస మార్గాలు భారత స్వాతంత్ర సంగ్రామానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక శాంతియుత పోరాటాలకు మార్గదర్శకంగా నిలిచాయని స్వదేశీ వస్తువుల వినియోగం గ్రామ స్వరాజ్యం పరిశుభ్రత మరియు నిరాడంబరమైన జీవనశైలిని స్వయంగా ఆచరించి చూపిన జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని వారి అడుగుజాడల్లో యువత అన్ని రంగాల్లో ముందుకు నడిచి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు.

వాత్సల్య పిల్లలు మంచి ప్రయోజకులు కావాలనే గొప్ప ఉద్దేశంతో బచ్చు వీరాస్వామి గారు లక్ష రూపాయలు అందచేయడమే కాకుండా కావలి రోటరీ క్లబ్ సభ్యుల ద్వారా సహాయం చేయడం అభినందనీయమని ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు అన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. మాధవరెడ్డి డిస్టిక్ గవర్నర్ నామినీ, కావలి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ జి సురేష్ రెడ్డి, మోడరన్ క్లాత్ షాప్ అధినేత మద్దుల. వెంకట నరసింహం, రోటరీ క్లబ్ రొటేరియన్స్ ఎం నరసింహారావు, ఎన్ రవికుమార్, పి కొండలరావు, వేమూరి శ్రీనివాసులు, హరి ప్రసాద్ రెడ్డి పి శంకర్ నారాయణ, ఓ వెంకటేశ్వరరావు, వాత్సల్య ఈసీ నెంబర్ ప్రసాద్, జి వి ఆర్ ఆర్ ప్రిన్సిపాల్ ఎబి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore