Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో వాటర్ ట్యాంక్ క్లీనింగ్ పరిశీలన

Nellore: నెల్లూరు 21వ డివిజన్ బాలసుబ్రహ్మణ్యం పార్క్ వద్ద వాటర్ ట్యాంక్ క్లీనింగ్ పరిశీలించిన కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల; డీప్ క్లీనింగ్‌కు ఆదేశం.

A Praveen, Nellore
Published on: 21 Nov 2026 10:36 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో వాటర్ ట్యాంక్ క్లీనింగ్ పరిశీలన

నెల్లూరు: 21వ డివిజన్ పరిధిలో ప్రజలకు అందుతున్న మౌలిక వసతులు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన నూతన కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకులు కిషోర్ గునుకుల ఈరోజు స్థానిక బాలసుబ్రహ్మణ్యం పార్క్ సమీపంలో ఉన్న మంచినీటి వాటర్ ట్యాంక్‌ క్లీనింగ్ ను పరిశీలించారు.

గత కొన్ని రోజులుగా డివిజన్‌లోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న విజయలక్ష్మి గునుకుల, ఈరోజు మంచినీటి సరఫరా విభాగం సిబ్బందితో కలిసి ట్యాంక్ క్లీనింగ్ పనులను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ట్యాంకులో పేరుకుపోయిన ఇసుక, మట్టి తదితర వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అయితే సాధారణ శుభ్రతతో పాటు ట్యాంకుకు పూర్తిస్థాయి డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఈ విషయంపై సంబంధిత ఏఈతో మాట్లాడి మరో పది రోజుల్లోపు డీప్ క్లీనింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు.

అదేవిధంగా, మంచినీటి సరఫరా ద్వారా స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలని, ముఖ్యంగా కొంతమంది స్థానికులు నీటిని వినియోగించిన అనంతరం దురద వంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల మాట్లాడుతూ, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా సేవా స్ఫూర్తితో, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ గారి మార్గదర్శకత్వంలో డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

డివిజన్‌లో ప్రతి మౌలిక సదుపాయం విషయంలో అధికారులు సానుకూలంగా స్పందిస్తున్నారని, ప్రజలకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను సైతం నిర్లక్ష్యం చేయకుండా తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మంచినీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి సమస్యలు ఏవైనా ఉంటే ప్రజలు నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడం అత్యంత ముఖ్యమని, వాటర్ ట్యాంకుల శుభ్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రతి నెలా డీప్ క్లీనింగ్ నిర్వహణపై అధికారులతో సమీక్షిస్తామని తెలిపారు.

ప్రజల ఆరోగ్యం.. మా బాధ్యత! ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రాధాన్యత! అనే నిబద్ధతతో 21వ డివిజన్ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని విజయలక్ష్మి గునుకుల, కిషోర్ గునుకుల స్పష్టం చేశారు.

నెల్లూరు నగరం 21వ డివిజన్ నూతన జనసేన కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకులు కిషోర్ గునుకుల, ప్రశాంత్ గౌడ్‌తో పాటు నరహరి, సుమంత్, రాజేష్, నాని, పవన్,శ్రీను,మున్సిల్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore