Nellore: గ్రంథాలయ ఉద్యమ పితామహుల సేవలను స్మరించుకున్న వక్తలు!

Nellore: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజున నెల్లూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుస్తక ప్రదర్శనను విద్యార్థులు తిలకించారు.

A Praveen, Nellore
Published on: 16 Nov 2026 5:27 PM IST
Nellore
X

Nellore: గ్రంథాలయ ఉద్యమ పితామహుల సేవలను స్మరించుకున్న వక్తలు!

నెల్లూరు: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మూడవ రోజున నెల్లూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమ పితామహుడు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారు మరియు భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ గారు దేశవ్యాప్తంగా గ్రంథాలయ ఉద్యమానికి చేసిన విశేష కృషిని వక్తలు స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి, సిబ్బందితో పాటు వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక పాఠశాల విద్యార్థులు గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.

వారోత్సవాల నిర్వహణలో విశేష కృషి చేస్తున్న గ్రంథాలయ సిబ్బందికి మరియు పాల్గొన్న విద్యార్థులకు ఈ సందర్భంగా కార్యదర్శి కుమార్ రాజా గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

A Praveen, Nellore

A Praveen, Nellore