Chillakuru: ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Chillakuru: చిల్లకూరు మండలం తీపనూరు వద్ద ఆటో బైక్‌ను ఢీకొన్న ఘటనలో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Oct 2026 6:13 PM IST
Chillakuru
X

Chillakuru: ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

చిల్లకూరు: నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తీపనూరు గ్రామ సమీపంలోని చింతల దిబ్బ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.సాయి కుమార్ ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు మధ్యాహ్నం సుమారు సమయంలో తన స్వగ్రామమైన తీపనూరు నుండి బైక్ పై బయలుదేరాడు.

చిల్లకూరు మండలం ఓడూరు గ్రామంలో ఉన్న గాయత్రీ మెరైన్ ప్రొడక్ట్స్ కంపెనీలో అతను డ్యూటీ చేస్తున్నాడు.డ్యూటీకి వెళ్తుండగా మార్గమధ్యంలో తీపనూరు గ్రామానికి చెందిన చింతల దిబ్బ సమీపంలోకి రాగానే ఎదురుగా అతివేగంగా వస్తున్న ఆటో అదుపు తప్పి అతని బైక్ ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సాయి కుమార్ ఎగిరిపడి తలపై బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది.స్థానికులు ఇచ్చిన సమాచారంతో చిల్లకూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.ఈ ఘటనతో తీపనూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి ఆధారమైన సాయి కుమార్ ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.వాహనదారులు అతివేగం తగ్గించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్