Nellore: నెల్లూరులో డీజీపీ పర్యటన.. చిన్న బజార్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

Nellore: నెల్లూరు జిల్లాలో పర్యటించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా; చిన్న బజార్ నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

A Praveen, Nellore
Published on: 24 Nov 2026 4:55 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో డీజీపీ పర్యటన.. చిన్న బజార్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని చిన్న బజార్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఐజీ త్రిపాఠి, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల పాల్గొన్నారు. నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన సదుపాయాలను అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ నగర ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలనే లక్ష్యంతో నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడంతో పాటు, ఫిర్యాదులపై వేగంగా స్పందించేందుకు ఆధునిక సౌకర్యాలతో పోలీస్ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పోలీస్ శాఖలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కల్పించడం, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడం లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

A Praveen, Nellore

A Praveen, Nellore