Nellore: ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

Nellore: నెల్లూరులో ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ర్యాలీ మరియు ధర్నా.

V. Narasimhulu, Nellore
Published on: 23 Sept 2026 7:53 PM IST
Nellore
X

Nellore: ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

నెల్లూరు: నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. 29, 30 డివిజన్ల పరిధిలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, వారి ఇళ్ల స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

బారాషాహిద్ దర్గా నుంచి నెల్లూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చేపట్టారు. ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న ప్రజల సమస్యను ప్రభుత్వం, అధికారులు పరిష్కరించాలని సీపీఎం నాయకులు కోరారు.

నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించి, అర్హులైన కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore