Nellore: యూపీఐ లావాదేవీల చార్జీలపై సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

Nellore: యూపీఐ లావాదేవీలపై 0.4% చార్జీలు విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరులో సీపీఎం ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి నిరసన ర్యాలీ.

V. Narasimhulu, Nellore
Published on: 18 Sept 2026 10:55 PM IST
Nellore
X

Nellore: యూపీఐ లావాదేవీల చార్జీలపై సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

నెల్లూరు: నగదు లావాదేవీలపై రెండు వేలకు మించిన యుపీఐ లావాదేవీలపై 0.4% చార్జీలు విధించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ,సిపిఎం పార్టీ నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, నెల్లూరు రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ మాట్లాడుతూ... యూపీఐ లావాదేవీలపై 0.4% విధించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దుర్మార్గం అన్నారు. ఈ భారం వినియోగదారులపైనే పడుతుందన్నారు.

ఈ నిర్ణయం వలన వ్యాపారులు, దుకాణదారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని వాటికి అలవాటు చేసి ఇప్పుడు యూపీఐ చార్జీలు విధించడం ప్రజలను మోసగించి, కార్పొరేట్ సంస్థలకు లాభాలుగా మార్చడమే అన్నారు.

కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడే దానికి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే మరో సాధనంగా యు పి ఐ ని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మారుస్తున్నదని అన్నారు. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వెంటనే యుపిఐ చార్జీలను ఉపసంహరించుకోవాలని ,లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కే .పెంచల నరసయ్య, మాల కొండయ్య ,సుధీర్ ,సంపత్ కుమార్ ,సురేష్, సుధాకర్, శంషాద్, శివాజీ, చంద్రమౌళి ,లవన్ కుమార్,అరికెల రమమ్మ, చెన్నయ్య, సుబ్బయ్య, జనార్ధన్ , ఖాజావలి, ఎస్కే షబ్బీర్, రాజా. గిరి. తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore