Nellore: నెల్లూరులో రెండవ రోజు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
Nellore: నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ పటిష్ట బందోబస్తు మధ్య కొనసాగింది. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.
Nellore: నెల్లూరులో రెండవ రోజు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
Nellore: గత రెండు మూడు రోజులుగా వర్షపు జల్లులతో నెల్లూరు నగర వాతావరణం చల్లబడినప్పటికీ... మరోవైపు మునుపెన్నడు లేనివిధంగా స్థానిక సంస్థల ఎన్నికల హీట్ నెల్లూరు నియోజకవర్గంలో రోజురోజుకీ పెరుగుతుంది.
నిన్నటి వరకు అధికార కూటమి పార్టీ నుంచి ప్రతిపక్ష వైయస్సార్సీపీలోకి... మరోవైపు వైఎస్ఆర్సిపి లో నుండి అధికార పక్షం వైపు చోటా నాయకుల వలసల పరంపర కొనసాగింది. నిన్నటి నుంచి మొదలైన నామినేషన్ ప్రక్రియ ఒక్కసారిగా వేడెక్కింది.
నామినేషన్ కార్యాలయాల వద్ద ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో రెండవ రోజు మరింత పటిష్ట బందోబస్తు మధ్య నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ 32 డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆదిరెడ్డి ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు.
అదేవిధంగా నెల్లూరు రూరల్ పరిధిలోని 44వ డివిజన్ టిడిపి అభ్యర్థిగా చెందలూరు నాగ తులసి నామినేషన్ దాఖలు చేశారు... నెల్లూరు సిటీ 59వ డివిజన్ వైసిపి అభ్యర్థిగా కిషన్ నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు రూరల్ 27 డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నూకరాజు మదన కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.




