Nellore: నెల్లూరు 21వ డివిజన్ జనసేన అభ్యర్థిగా విజయలక్ష్మి నామినేషన్
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ 21వ డివిజన్ జనసేన కూటమి అభ్యర్థిగా విజయలక్ష్మి గునుకుల ఎనమలవారిదిన్నె ఆర్ఓ కార్యాలయంలో శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
Nellore: నెల్లూరు 21వ డివిజన్ జనసేన అభ్యర్థిగా విజయలక్ష్మి నామినేషన్
నెల్లూరు: జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా విజయలక్ష్మి గునుకుల శనివారం నామినేషన్ దాఖలు చేశారు... స్థానిక ఎనమలవారిదిన్నె వద్ద ఉన్న RO కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి గునుకుల మాట్లాడుతూ...
ఈ నామినేషన్ కేవలం ఎన్నికల ప్రక్రియ కాదు… మా డివిజన్ ప్రజలపై మాకున్న బాధ్యతకు, వారి అభివృద్ధి పట్ల మాకున్న నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు.
ఇప్పటికే డివిజన్లోని ప్రతి గడపను పలకరిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి ఆప్యాయతను, ఆదరణను హృదయపూర్వకంగా స్వీకరించామని తెలిపారు. ప్రజలు తమపై చూపుతున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో మరింత అంకితభావంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసి తమకు మద్దతుగా నిలిచిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, వీరమహిళకు, అభిమానులకు, శ్రేయోభిలాషికి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో అందరూ ఐక్యంగా కృషి చేసి, 21వ డివిజన్లో కూటమి విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




