Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం ఉత్సాహం!

Nellore:నెల్లూరు సిటీ 21వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను వివరించగా, స్థానికులు ఘనంగా మద్దతు తెలిపారు.

A Praveen, Nellore
Published on: 26 Sept 2026 2:53 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం ఉత్సాహం!

Nellore: ప్రస్తుత 21వ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా, కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకూ వివరిస్తూ ప్రజలను కలుస్తున్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ, రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ పాలన, భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించారు.

ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన, నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం కొనసాగింది.

నెల్లూరు నగరాన్ని అభివృద్ధిలో రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజలతో కలిసి ముందుకు సాగుతామని జనసేన నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకులతో పాటు నాగేంద్రబాలు, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, ఆమని, ప్రవళిక, ప్రశాంతి, స్థానికులు నరహరి, విజయ, సుప్రియ, కృష్ణవేణి, కుమారి పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore