Nellore: కంట్లో కారం కొట్టి రూ.3 లక్షల దోపిడీ: నెల్లూరులో దారుణం
Nellore: నెల్లూరు జిల్లా కాగితాలపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో బ్రాందీ షాపు క్యాషియర్ కంట్లో కారం చల్లి రూ.3 లక్షల నగదును దుండగులు దోచుకెళ్లారు.
Nellore: కంట్లో కారం కొట్టి రూ.3 లక్షల దోపిడీ: నెల్లూరులో దారుణం
Nellore: నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. కంట్లో కారం కొట్టి బ్రాందీ షాప్ క్యాషియర్ నుంచి 3 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లిన ఘటన కాగితాలపూర్ రోడ్డు క్రాస్ రోడ్ లో కలకలం రేపింది.
కాగితాలపూర్ రోడ్డు క్రాస్ రోడ్ లో ఉన్న బ్రాందీ షాపులో మడమనూరు గ్రామానికి చెందిన రమేష్, గోపి లు క్యాషియర్లుగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే రాత్రి షాపు మూసివేసిన తర్వాత ఆ రోజు వచ్చిన కలెక్షన్ 3 లక్షల రూపాయలను తీసుకుని రెండు మోటార్ సైకిళ్లపై ఇంటికి బయలుదేరారు.
వారు కొంత దూరం వెళ్లగానే ముందుగానే కాపు కాసిన నలుగురు దుండగులు రెండు మోటార్ సైకిళ్లపై వారిని వెంబడించారు. నిర్మానుష్య ప్రదేశానికి రాగానే వారిని అడ్డగించి ఒక్కసారిగా రమేష్ కళ్లలో కారం చల్లారు.
కారం ఘాటుకు రమేష్ కళ్లు మండిపోవడంతో అదుపుతప్పి బైక్ తో సహా కింద పడిపోయారు తలకు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ అదను చూసుకుని దుండగులు రమేష్ వద్ద ఉన్న 3 లక్షల రూపాయల నగదు ఉన్న బ్యాగ్ ను లాక్కుని అక్కడి నుండి పరారయ్యారు.
తీవ్ర గాయాలపాలైన రమేష్ ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం రమేష్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నలుగురు దుండగుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలుచేపట్టారు




