Nellore: అనంతసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి

Nellore: నెల్లూరు జిల్లా అనంతసాగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. తిరుపతి నుండి శ్రీశైలం వెళుతుండగా ఘటన.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 9 Oct 2026 4:50 PM IST
Nellore
X

Nellore: అనంతసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి

నెల్లూరు: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం యాకర్లపాడు సమీపంలో హైవే పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుండి శ్రీశైలం దైవ దర్శనానికి వెళుతున్న కారు టైరు ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను ఢీకొంది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పువ్వాడి పుష్పలత (49) అక్కడికక్కడే మృతి చెందగా దాసరి రాజశేఖర్ (24) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు.మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను, మృతదేహాలను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)