Atmakur: ఆత్మకూరులో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియను, ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయ నామినేషన్ కేంద్రాన్ని ఆర్డీవో బి. పావని పరిశీలించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 18 Nov 2026 5:37 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని!

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియను ఆత్మకూరు ఆర్డీవో బి.పావని పరిశీలించారు. ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు పట్టణ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రభుత్వ నిబంధనలు, శిక్షణలో సూచించిన విధివిధానాలను పాటిస్తూ ఎలాంటి వివాదాలకు తావులేకుండా నామినేషన్ల స్వీకరణ చేపట్టాలని సిబ్బందికి సూచించారు. మిగిలిన మండలాల్లోని నామినేషన్ల ప్రక్రియను స్థానిక అధికారుల నుంచి ఫోన్ ద్వారా తెలుసుకుని తగు సూచనలు చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)