Atmakur: బండారుపల్లి శివాలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందజేత!
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లి గ్రామంలో నిర్మిస్తున్న శివాలయానికి నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి రూ.1,00,000 విరాళం అందజేసి దాతృత్వం చాటుకున్నారు.
Atmakur: బండారుపల్లి శివాలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందజేత!
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం, బండారుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయ నిర్మాణానికి నిత్యాన్నదాత శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి గారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో శివాలయ ముఖద్వార ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని ప్రకటించిన ఆయన, ఇచ్చిన మాట ప్రకారం స్వయంగా బండారుపల్లి గ్రామానికి విచ్చేశారు.
గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో ₹1,00,000/- (లక్ష రూపాయల) నగదును ఆలయ నిర్మాణ నిమిత్తం అందజేశారు. అంతేకాకుండా, త్వరలో జరగబోయే శిలా ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసే భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. గ్రామానికి విచ్చేసిన శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి గారికి బండారుపల్లి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆత్మీయంగా సాదర స్వాగతం పలికారు.
అనంతరం ఆయన నూతన శివాలయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై గ్రామస్తులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శ్రీ సీతారాముల దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, పండితుల ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు అందించడమే కాకుండా, అన్నదానానికి ముందుకొచ్చిన శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి గారిని గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.




