Nellore: 71, 72 డివిజన్లలో అబ్దుల్ అజీజ్ ప్రచార హోరు!

Nellore: నెల్లూరు 71, 72 డివిజన్లలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రచారం. కూటమి అభ్యర్థుల గెలుపుతోనే కార్పొరేట్ విద్యా వసతులు, మౌలిక ప్రగతి సాధ్యమని ప్రకటన.

A Praveen, Nellore
Published on: 27 Oct 2026 8:13 PM IST
Nellore
X

Nellore: 71, 72 డివిజన్లలో అబ్దుల్ అజీజ్ ప్రచార హోరు!

నెల్లూరు: నెల్లూరు నగరంలోని 71, 72వ డివిజన్లలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 71వ డివిజన్‌లో కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి ఆలియా, 72వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, జహీర్ సతీమణి సల్మాకు మద్దతుగా ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు.

రెండు డివిజన్లలో కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, పేద కుటుంబాలకు మెరుగైన విద్య, మౌలిక వసతులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో సరైన రహదారులు లేని ఈ ప్రాంతంలో మంత్రి నారాయణ హయాంలో రోడ్ల నిర్మాణం జరిగిందని గుర్తుచేశారు.

తాను మేయర్‌గా ఉన్న సమయంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ శ్మశానవాటికలకు స్థలాలు కేటాయించి, ప్రహరీ గోడలు నిర్మించినట్లు తెలిపారు. రోజువారీ కూలీ పనులపై ఆధారపడే కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లోనూ తమ పిల్లలను చదివించుకుంటున్నాయని, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందన్నారు.

పేద బిడ్డలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు సుమారు రూ.15–20 కోట్లతో అంతర్జాతీయ పాఠశాల నిర్మించనున్నట్లు వివరించారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో షాదీ మంజిల్‌తో పాటు పార్కులు, మినీ స్టేడియం వంటి వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విద్య, క్రీడలు, సామాజిక అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రజల భద్రత కోసం ఈ ప్రాంతంలో పోలీస్ అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నెల్లూరు మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్‌ను, 71వ డివిజన్ కార్పొరేటర్‌గా ఆలియాను, 72వ డివిజన్ కార్పొరేటర్‌గా షేక్ సల్మాను అత్యధిక మెజారిటీతో గెలిపించి, అభివృద్ధికి అండగా నిలవాలని అబ్దుల్ అజీజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

A Praveen, Nellore

A Praveen, Nellore