Nellore: నెల్లూరు అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి
Nellore: నెల్లూరు 69వ డివిజన్‌లో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఎన్నికల ప్రచారం. మేయర్ అభ్యర్థి రూప్ కుమార్, షాహినా బేగంలను గెలిపించాలని విజ్ఞప్తి.
Nellore: నెల్లూరు అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి
నెల్లూరు: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి ఓటర్లు కార్పొరేటర్‌తో పాటు మేయర్ అభ్యర్థికి కూడా నేరుగా ఓటు వేయనున్నారని ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. కుటుంబ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ 69 వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుధీర్ ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గతంలో కార్పొరేటర్లు కలిసి మేయర్‌ను ఎన్నుకునేవారని, ఈసారి కార్పొరేటర్, మేయర్ స్థానాలకు విడివిడిగా ఓటు వేయాల్సి ఉంటుందని వివరించారు.
తెలుగుదేశం పార్టీ–కూటమి తరఫున రూప్‌కుమార్ యాదవ్‌ను మేయర్ అభ్యర్థిగా నిర్ణయించారని, 69వ డివిజన్ నుంచి షాహినా బేగంకు కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం కల్పించారని చెప్పారు. గతంలో కూడా షాహినా బేగం ఈ డివిజన్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేశారని గుర్తుచేశారు.
ఈ ప్రాంత ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అబ్దుల్ అజీజ్ అన్నారు. గతంలో తాను మేయర్‌గా ఉన్న సమయంలో నెల్లూరులో జరిగిన అభివృద్ధిని గుర్తుచేస్తూ, ఈసారి అంతకంటే రెండింతల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
నగర ఎమ్మెల్యేగా నారాయణ ఉండటం, పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం నెల్లూరుకు కలిసివచ్చే అంశమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ప్రభుత్వానికి భిన్నంగా స్థానిక పాలన ఉంటే ప్రజలకు నష్టం కలుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూప్‌కుమార్ యాదవ్, షాహినా బేగంలను భారీ మెజారిటీతో గెలిపించాలని 69వ డివిజన్ ప్రజలను కోరారు.




