Nellore: మూలాపేట వినాయక ఆలయంలో వైభవంగా అన్నప్రసాద వితరణ

Nellore: నెల్లూరు మూలాపేట వినాయక ఆలయంలో ఘనంగా అన్నప్రసాద వితరణ. పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించిన భక్తులు.

A Praveen, Nellore
Published on: 17 Sept 2026 1:47 PM IST
Nellore
X

Nellore: మూలాపేట వినాయక ఆలయంలో వైభవంగా అన్నప్రసాద వితరణ

నెల్లూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరం మూలాపేటలోని శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ప్రత్యేక విశిష్టత కలిగిన శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సహాయ సహకారాలతో ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు ప్రధాన అర్చకుడు హరి తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో భక్తులకు అన్నప్రసాదం అందించడం ఎంతో సంతృప్తినిచ్చే విషయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. కార్యక్రమంలో లహరి, మాధవ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore