Nellore: ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యం.. నెల్లూరు పోలీసుల ఘనత

Nellore: ఎనిమిదేళ్ల క్రితం నెల్లూరులో అదృశ్యమైన వివాహిత దెవెళ్ల లక్ష్మి ఆచూకీని నెల్లూరు ఏహెచ్‌టీయూ, మహిళా పోలీసులు శ్రీకాళహస్తిలో సురక్షితంగా గుర్తించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 3 Oct 2026 7:03 PM IST
Nellore
X

Nellore: ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యం.. నెల్లూరు పోలీసుల ఘనత

Nellore: మహిళల అదృశ్య కేసులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, తప్పిపోయిన మహిళల ఆచూకీని గుర్తించి వారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించే దిశగా SPSR నెల్లూరు జిల్లా ఎస్. పి ఆదేశాల మేరకు చేపడుతున్న చర్యల్లో భాగంగా, ఎనిమిదేళ్లుగా అదృశ్యమైన ఒక వివాహిత మహిళను AHTU (Anti Human Trafficking Unit), నెల్లూరు బృందం, మహిళా పోలీస్ స్టేషన్ నెల్లూరు వారి సమన్వయంతో సురక్షితంగా గుర్తించింది.

నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నం.596/2018, Woman Missing కేసులో అదృశ్యమైన దెవెళ్ల లక్ష్మి, భర్త: చంద్రశేఖర్, వయస్సు: 39 సంవత్సరాలు, TVN రైస్ మిల్, సౌత్ రాజుపాలెం గ్రామం, నెల్లూరు రూరల్ మండలానికి చెందిన మహిళగా, స్వస్థలం శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కేసర గ్రామంగా గుర్తించారు.

సుమారు ఎనిమిదేళ్లుగా అదృశ్యంగా ఉన్న వివాహిత మహిళను AHTU, నెల్లూరు బృందం ప్రత్యేకంగా అన్వేషిస్తూ, అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి, 03.10.2026న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ప్రాంతంలో సురక్షితంగా గుర్తించింది.

ఆమెను సురక్షితంగా గుర్తించిన అనంతరం తదుపరి అవసరమైన చట్టపరమైన చర్యల నిమిత్తం నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించే ప్రక్రియ చేపట్టారు.

మహిళల అదృశ్య కేసులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, అందుబాటులో ఉన్న సాంకేతిక మరియు ఇతర సమాచారాన్ని సమన్వయం చేసుకుని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో కూడా ఆచూకీని గుర్తించేందుకు AHTU బృందాలు నిరంతరం కృషి చేస్తున్నాయి.

ఎనిమిదేళ్లుగా అదృశ్యమైన మహిళను గుర్తించి సురక్షితంగా తీసుకురావడంలో కృషి చేసిన AHTU, నెల్లూరు బృందాన్ని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, అభినందించారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE