Nellore: నెల్లూరులో వైసీపీలోకి భారీ చేరికలు.. టీడీపీకి గట్టి షాక్!

Nellore: నెల్లూరులో టీడీపీకి షాక్; కార్పొరేటర్ షఫీయా బేగం, 400 కుటుంబాలు కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో వైయస్సార్‌సీపీలో చేరాయి.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 15 Oct 2026 10:21 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో వైసీపీలోకి భారీ చేరికలు.. టీడీపీకి గట్టి షాక్!

Nellore: నెల్లూరు వైసీపీ సిటీ కార్యాలయంలో.. వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైసిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. టిడిపి నాయకులు ముజీర్ ఆయన సతీమణి 54వ డివిజన్ కార్పొరేటర్ షఫీయా బేగం, వారి అనుచరుగణం 300 కుటుంబాలు.... అలాగే టిడిపి నుంచి యలమంద రెడ్డి, వారి అనుచరుగణం 100 కుటుంబాలు.. మొత్తం 400 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి వైసిపి నెల్లూరు జిల్లా వైసిపి అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి , పార్టీ కండువా వేసి సాధారంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వానికి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ఘోర పరాభవం తప్పదని, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి లభిస్తున్న ఆధరణే అందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ. ఈ రోజు అధికార పార్టీ నుంచి 400 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషకరమన్నారు.

కూటమి ప్రభుత్వం మూడేళ్లలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి..రాష్ట్రం లో దుర్మార్గపు పాలన సాగిస్తుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక,అక్రమ కేసులు,అవినీతి కార్యక్రమాలతో.. చంద్రబాబు నాయుడు.. దోచుకో..దాచుకో అన్న విధంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని.. మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారని.. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో..నెల్లూరు నగరంతో పాటు ఈ రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో ..వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విజయ కేతనం ఎగురవేయనుందని అన్నారు... ఈరోజు పార్టీ నాయకత్వాన్ని.. నమ్మి పార్టీలోకి వస్తున్న వారికి.. రాబోయే రోజుల్లో సముచిత స్థానం గౌరవం కల్పించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో వైసిపి స్టేట్ సెక్రటరీ పెర్నాటి కోటేశ్వర రెడ్డి, 14 డివిజన్ ఇన్ చార్జ్ గిరి రెడ్డి, 53వ డివిజన్ ఇన్ చార్జ్ వెంగళ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE