Nellore: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రథమ బాధ్యత!
Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో బాలసుబ్రహ్మణ్యం పార్క్ సమీపంలోని వాటర్ ట్యాంక్‌ను కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, జనసేన నేత కిషోర్ గునుకుల శుక్రవారం పరిశీలించారు.
Nellore: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రథమ బాధ్యత!
నెల్లూరు: నెల్లూరు నగరంలోని 21వ డివిజన్ పరిధిలో బాలసుబ్రహ్మణ్యం పార్క్ సమీపంలో స్థానిక ప్రజలకు నీటి సరఫరా చేసే వాటర్ ట్యాంక్‌ను ఈరోజు సాయంత్రం 21వ డివిజన్ నూతన కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకులు కిషోర్ తో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంక్ నిర్వహణలో కొన్ని లోపాలను గుర్తించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
పరిశీలనలో గుర్తించిన అంశాలు – అధికారులకు చేసిన సూచనలు
ట్యాంక్‌కు మూత లేకపోవడం: వాటర్ ట్యాంక్ పైభాగంలో రక్షణ మూత లేకపోవడాన్ని గమనించి, మలినాలు లోపలికి చేరకుండా మెష్‌తో కూడిన సురక్షితమైన డోర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
పరిశుభ్రత లోపం: ట్యాంక్ కింది భాగంలో పేరుకుపోయిన చెత్త,మురికిని వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.
క్లీనింగ్ వివరాల బోర్డు: ప్రతి వాటర్ ట్యాంక్ వద్ద ప్రత్యేక ఉన్న బోర్డు పై, ట్యాంక్‌ను చివరిసారిగా శుభ్రం చేసిన తేదీ, తదుపరి శుభ్రం చేయాల్సిన తేదీని స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు.
క్లోరిన్ శాతం వివరాలు: ప్రజలకు సరఫరా చేసే నీటిలో క్లోరిన్ స్థాయిని పరీక్షించి, సంబంధిత వివరాలను బోర్డుపై పొందుపరచాలని తెలిపారు.
నిర్వహణపై పర్యవేక్షణ: ఎన్ని రోజులకొకసారి ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి క్లీనింగ్ సమయంలో కూడా స్వయంగా సందర్శించి పనులను పరిశీలిస్తామని తెలిపారు.
నీటి నాణ్యత: ప్రజలకు సరఫరా చేసే తాగునీరు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, ఎటువంటి కలుషితాలు లేకుండా ఉండేలా అవసరమైన పరీక్షలు, చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
త్వరలో మెగా ప్యూరిఫైడ్ వాటర్ సరఫరా
నెల్లూరు నగర ప్రజలకు మరింత మెరుగైన తాగునీటి సదుపాయం కల్పించే దిశగా త్వరలో బ్లూ పైప్‌లైన్ ద్వారా మెగా ప్యూరిఫైడ్ వాటర్ సరఫరా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, ప్రస్తుత నీటి సరఫరా వ్యవస్థను కూడా మెరుగుపరచడం, వాటర్ ట్యాంకుల పరిశుభ్రతను కాపాడటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన తాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడం అధికారులతో పాటు ప్రజాప్రతినిధులుగా తమ ముఖ్య బాధ్యత అని తెలిపారు.
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజాసేవా స్ఫూర్తి, నెల్లూరు నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో డివిజన్‌లోని ప్రజా సమస్యలను నిరంతరం గుర్తిస్తూ, సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన తాగునీరు అందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిశోర్ గునుకుల, 21వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, ప్రశాంత్, రావు, విజయ, నరహరి, సుమంత్, రాజేష్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




