Kaluvaya: గాజు గ్లాస్, సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి!
Kaluvaya: నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు సెగ్మెంట్ జనసేన ఎంపీటీసీ అభ్యర్థి మాలే రామారావు వెంకటరెడ్డిపల్లిలో ఇంటింటి ప్రచారం. గాజు గ్లాస్, సైకిల్ గుర్తులపై ఓటేయాలని పిలుపు.
Kaluvaya: గాజు గ్లాస్, సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి!
Kaluvaya: నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు సెగ్మెంట్ ను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు, ఆ పార్టీ ఎంపిటిసి అభ్యర్థి మాలే రామారావు వెంకటరెడ్డి పల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్రంలో అటు సంక్షేమ, ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోనే ముందుదని కొనియాడారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక శాఖలను తన మార్క్ రాజకీయాలతో ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు, ఇప్పటికే మనదేశంలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో ముందు ఉందని తెలిపారు, కూటమి బలపరిచిన తనకు గాజు గ్లాస్ గుర్తుకు ఓటెయ్యాలని, జడ్పిటిసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అభ్యర్థించారు, వారితోపాటు మాజీ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మనోహర్, సుసర్ల హరి, హరి ప్రసాద్, టిడిపి నాయకులు సుదర్శన్ రాజేష్, రవి, బిజెపి నాయకులు చిన్న తదితరులు పాల్గొన్నారు.




