Nellore: నెల్లూరులో కూటమి అగ్రనేతల భేటీ ఫేక్ ప్రచారాలపై తీవ్ర ఆగ్రహం!

Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నివాసంలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ, కూటమి నేతల భేటీ. 72 డివిజన్లు, మేయర్ పీఠం కూటమిదేనని ధీమా.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 26 Oct 2026 12:10 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో కూటమి అగ్రనేతల భేటీ ఫేక్ ప్రచారాలపై తీవ్ర ఆగ్రహం!

Nellore: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసంలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీద, మేయర్ అభ్యర్ధి రూప్ కుమార్, బీజేపీ నేత వంశీధర్ రెడ్డి, జనసేన నేత వేములపాటి అజయ్ సమావేశం అయ్యారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు ఉన్నట్టు ఫేక్ ప్రచారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ప్రజలు గమనించాలని, మంత్రి నారాయణ పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ది చేస్తున్నారని, ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎంతటి సమస్యనైనా పరిష్కరిస్తారని చెప్పారు.

నెల్లూరు అభివృద్దికి నారాయణ, కోటంరెడ్డి కష్టపడి పనిచేస్తున్నారని, నగరంలో ఎక్కడికి వెళ్లినా ఎండ్ టూ ఎండ్ రోడ్లు, అద్భుతైన పార్కులు, క్లోజ్డ్ డ్రైనేజీ కనిపిస్తున్నాయని చెప్పారు.

అంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరుని దేశంలోనే నెంబర్ ఒన్ నగరంగా తయారు చేస్తామని, గత టీడీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ది కొనసాగుతుందని, 2027 జూన్ 12 నాటికి నగరంలో UDG పనులు పూర్తిచేసి దోమలులేని నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఖజానా ఖాళీ అయినా, సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని, స్థానిక సమస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ పరిధిలోని 36 డివిజన్లలో 8 డివిజన్లలో టీడీపీ అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారని, అనేక చోట్ల వైసీపీ అభ్యర్ధులు పోటీ నుంచి తప్పుకున్నారని, డమ్మీ అభ్యర్ధులే మిగిలారని చెప్పారు.

వైసీపీ నేతలు ఓటమి భయంతో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో, నెల్లూరు నగరం అనేక రకాలుగా అభివృద్ది చెందిందని చెప్పారు. కూటమి పార్టీల విజయంతోనే నెల్లూరు అభివృద్ధి సాధ్యమని అసత్య ప్రచారాలతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూడటం సిగ్గుచేటని విమర్శించారు జనసేన నేత వేములపాటి అజయ్.

బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కార్పొరేషన్ పరిధిలోని 72 డివిజన్లు,మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకోబోతోందని చెప్పారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE