Vinjamoor: వింజమూరు బుక్కాపురంలో జాతీయ పోషణ మాసోత్సవాలు!

Vinjamoor: నెల్లూరు జిల్లా వింజమూరు మండలం బుక్కాపురం అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషణ మాసం అవగాహన సదస్సు జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Sept 2026 4:15 PM IST
Vinjamoor
X

Vinjamoor: వింజమూరు బుక్కాపురంలో జాతీయ పోషణ మాసోత్సవాలు!

వింజమూరు: 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా వింజమూరు మండలం బుక్కాపురం అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ పిల్లల తల్లులు, లబ్ధిదారులకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోషణ మాసం కార్యాచరణలో భాగంగా చిన్నారులకు అందించే తాజా వేడి భోజనం (హాట్ కుక్డ్ మీల్స్) ప్రాధాన్యతను తల్లులకు వివరించారు.

అంగన్వాడీ కేంద్రంలోనే తయారు చేసిన వేడి భోజనాన్ని తల్లుల సమక్షంలో ప్రీస్కూల్ పిల్లలకు అందించారు.భోజనంలో ఉపయోగించిన పదార్థాల్లోని పోషక విలువలు,చిన్నారుల శారీరక ఎదుగుదల,ఆరోగ్య పరిరక్షణకు అవి ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాలను తల్లులకు వివరించారు.

పిల్లలకు ప్రతిరోజూ రుచికరమైన,పరిశుభ్రమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించేలా తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మునగాకుతో ఎన్నో పోషక ప్రయోజనాలు ఈ సందర్భంగా స్థానికంగా సులభంగా లభించే మునగాకులో ఉన్న పోషక విలువలు, చిన్నారుల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు.

ఖరీదైన ఆహార పదార్థాలపై ఆధారపడకుండా స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలను పిల్లల ఆహారంలో భాగం చేయాలని సూచించారు. ముఖ్యంగా మునగాకును పిల్లల భోజనంలో తరచూ చేర్చేలా తల్లులు చర్యలు తీసుకోవాలని సీడీపీవో చ. పద్మజ కుమారి సూచించారు.

పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు చిన్ననాటి నుంచే సరైన పోషకాహారం అందించడం ఎంతో ముఖ్యమని,అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారాన్ని తల్లులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ టీ. తేజస్వి, MLHP పీ. మాళవిక, కె. శేషమ్మ, VOA శైలజ, అంగన్వాడీ కార్యకర్తలు మహేశ్వరి, జ్యోతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్