Duttalur: అక్టోబర్ 6న నఱ్ఱవాడలో వరుణ యాగం: ఎమ్మెల్యే హాజరు

Duttalur: సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని నెల్లూరు జిల్లా నఱ్ఱవాడ వెంగమాంబ ఆలయంలో అక్టోబర్ 6న వరుణ యాగం; ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 5 Oct 2026 5:50 PM IST
Duttalur
X

Duttalur: అక్టోబర్ 6న నఱ్ఱవాడలో వరుణ యాగం: ఎమ్మెల్యే హాజరు

నెల్లూరు జిల్లా: దుత్తలూరు మండలం నఱ్ఱవాడ గ్రామంలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో అక్టోబర్ 6వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల 54 నిమిషాలకు వరుణ యాగం నిర్వహించనున్నారు.

సకాలంలో మంచి వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొననున్నారు.

వరుణ యాగం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

ప్రధాన వ్యవస్థాపక ధర్మకర్త వేమూరి ముసలయ్య, వ్యవస్థాపక ధర్మకర్తలు పచ్చవ వెంగయ్య, పచ్చవ వెంకటేశ్వర్లు, పచ్చవ కరుణాకర్ బాబు, డాక్టర్ తుమ్మల వెంకటసురేష్ బాబు, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్తలు మరియు కార్యనిర్వహణాధికారి.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI