Gudur: గూడూరు నూతన డీఎస్పీగా నరసింహమూర్తి బాధ్యతల స్వీకరణ
Gudur: గూడూరు సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా నరసింహమూర్తి బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
Gudur: గూడూరు నూతన డీఎస్పీగా నరసింహమూర్తి బాధ్యతల స్వీకరణ
గూడూరు: గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం DSP కార్యాలయంలోని రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, శాంతిభద్రతల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గూడూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకే తొలి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు, ఓజిలి మండలాల పరిధిలో నేరాల అదుపు, రౌడీయిజం, గంజాయి, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.మహిళల భద్రత, చిన్నారుల భద్రత విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు.
ప్రజలు నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ సమస్యలను చెప్పుకోవచ్చని, ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.గూడూరు DSP గా అనుభవం ఉన్న అధికారి నరసింహమూర్తి రావడంతో గూడూరులో శాంతిభద్రతలు మరింత మెరుగుపడతాయని, నేరాలకు అడ్డుకట్ట పడుతుందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




