Nellore: రాపూరు మేజర్ పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా నల్లవట్ల సునంద!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా నల్లవట్ల సునంద పేరును ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రకటించారు.
Nellore: రాపూరు మేజర్ పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా నల్లవట్ల సునంద!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నల్లవట్ల సునంద పేరును వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా ఎన్డీసీసీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి సంయుక్తంగా ప్రకటించారు.
గత కొంతకాలంగా రాపూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై తెలుగుదేశం పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీలో ఇద్దరు నాయకులు సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని ఆశించడంతో అభ్యర్థి ప్రకటన కొంత ఆలస్యమైంది.
ఎట్టకేలకు పార్టీ ముఖ్య నాయకుల చర్చల అనంతరం టీడీపీ సీనియర్ నాయకుడు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి సతీమణి నల్లవట్ల సునందకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అభ్యర్థి ప్రకటనతో రాపూరు టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం నల్లవట్ల సునంద తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు మండల టీడీపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.




