Naidupeta: నాయుడుపేట మున్సిపాలిటీలో ఆధిపత్య పోరు!
Naidupeta: నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం 'జనరల్ మహిళ'కు రిజర్వ్ కావడంతో స్థానిక రాజకీయాలు వేడెక్కాయి. రేసులో ఉన్న నాయకులు, ఎమ్మెల్యే వ్యూహాలపై చర్చ.
Naidupeta: నాయుడుపేట మున్సిపాలిటీలో ఆధిపత్య పోరు!
Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో స్థానిక ఎన్నికల లో భాగంగా నాయుడుపేట మున్సిపాలిటీలో ఎన్నికల రిజర్వేషన్ జనరల్ మహిళ అవడంతో ఇప్పుడు చైర్ పర్సన్ సీట్ పై అగ్ర నాయకులతోపాటు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల కన్ను పడడంతో నాయుడుపేట మున్సిపాలిటీలో ఆధిపత్య పోరు కు నాయకుల మధ్య రాజకీయ పోరు మొదలయ్యింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు,
అగ్ర నాయకులు ఓ పక్క జనరల్ మహిళా రిజర్వేషన్ కావడంతో బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల ఆశావాహులు మరోపక్క పార్టీలో కొత్తగా చేరిన వారు, ఎప్పటినుండో తెలుగుదేశం పార్టీ నీ నమ్ముకొని ఉన్న నాయకులు మరోపక్క నాయుడుపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ సీటు ను తమకు కేటాయించాలని ఇప్పటికే ఎమ్మెల్యే విజయశ్రీ వద్ద వారి అభిప్రాయాలను తెలియజేసినట్లు తెలుస్తుంది,
మరోపక్క వైఎస్ఆర్సిపి పార్టీ కూడా బలమైన నాయకులకు నాయుడుపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ సీటును కేటాయించే విధంగా పావులు కదుపుతుండడంతో ఎమ్మెల్యే విజయశ్రీ తెలుగుదేశం పార్టీలోని బలమైన నాయకుల వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది, ఏది ఏమైనా నాయుడుపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ సీటు పై అగ్ర నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త కూడా తమకు కేటాయించాలని రాజకీయ లలో ఇది సాధారణమైన విషయమని వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం శుభ పరిమాణంగా తెలుస్తుంది.




