Atmakur: మురుగుళ్ల జెడ్పీ స్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్‌గా తోడేటి అన్నపూర్ణమ్మ
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మురుగుళ్ల జెడ్పీ హైస్కూల్ SMC చైర్మన్‌గా తోడేటి అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్‌గా తోడేటి లక్ష్మీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Atmakur: మురుగుళ్ల జెడ్పీ స్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్‌గా తోడేటి అన్నపూర్ణమ్మ
నెల్లూరు జిల్లా: ఆత్మకూరు మండలం మురుగుళ్ల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో ప్రశాంతంగా జరిగాయి.
ఈ ఎన్నికల్లో మొత్తం 12 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం వారిలో నుండి చైర్మన్ గా తోడేటి అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ గా తోడేటి లక్ష్మీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ లకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు తమ వంతు కృషి చేయాలని ఉపాధ్యాయులు వారిని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ పెంచలరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఎన్నికలను విజయవంతం చేశారు.




