Nellore: ఎన్నికలు పారదర్శకంగా జరగాలి జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు!

Nellore: ఎన్నికల నియమావళికి లోబడి పారదర్శకంగా విధులు నిర్వహించాలని జేసి మొగిలి వెంకటేశ్వర్లు, నగర కమిషనర్ వై.ఓ నందన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.

V. Narasimhulu, Nellore
Published on: 14 Oct 2026 10:31 PM IST
Nellore
X

Nellore: ఎన్నికలు పారదర్శకంగా జరగాలి జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు!

నెల్లూరు: రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఎన్నికల నియమావళికి లోబడి రానున్న సాధారణ ఎన్నికలలో విధులను నిర్వహించి, ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగేలా ప్రతి ఒక్క ఎన్నికల అధికారి, సిబ్బంది కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి. వెంకటేశ్వర్లు సూచించారు.

ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో కమిషనర్ వై.ఓ నందన్ తో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసినందున నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని తెలిపారు.

పోలింగ్ బూత్ల నిర్వహణ ఓటర్లకు అవగాహన తదితర కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేసి ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఓటింగ్ శాతం మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సిబ్బందికి జేసి సూచించారు.

ఈ సమావేశంలో సిటీ ప్లానర్ రఘునాథ రావు,ఎన్నికల లైజనింగ్ అధికారి రాజేంద్రప్రసాద్, రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore