Nellore: సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే మున్సిపల్ ఎన్నికలు: మంత్రి నారాయణ

Nellore: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు.

A Praveen, Nellore
Published on: 4 Oct 2026 8:31 PM IST
Nellore
X

Nellore: సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే మున్సిపల్ ఎన్నికలు: మంత్రి నారాయణ

నెల్లూరు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

నెల్లూరులో పర్యటించిన సందర్భంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.12 వేల కోట్ల నిధులు అందే అవకాశం ఉందని, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఆయా సంస్థల అభివృద్ధికి అవసరమైన నిధుల వినియోగానికి మార్గం సుగమమవుతుందని మంత్రి పేర్కొన్నారు.

వార్డుల విభజన, రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సంబంధిత ప్రక్రియలో పురోగతి ఉంటుందని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వెల్లడించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore