Nellore: కార్పొరేషన్ ఆఫీస్ లో కమిషనర్ వై.ఓ.నందన్ హై-లెవెల్ సమీక్ష!
Nellore: నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ వై.ఓ.నందన్ ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, ఎల్ అండ్ టీ ప్రతినిధులతో 7 జోన్ల తాగునీటి సరఫరా పనులపై సమీక్ష జరిగింది.
Nellore: కార్పొరేషన్ ఆఫీస్ లో కమిషనర్ వై.ఓ.నందన్ హై-లెవెల్ సమీక్ష!
నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.నందన్ గురువారం కార్యాలయంలోని తన ఛాంబర్ లో నగరపాలక సంస్థ, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం వారితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మెగా సప్లై ద్వారా త్రాగునీరు సరఫరా పనులు వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. అలాగే జోనల్ సిస్టం ద్వారా వాటర్ సప్లై జరిగేలా చర్యలు చేపట్టాలని, అలాగే కొత్త మెగా లైన్స్ ద్వారా వాటర్ సప్లై 7 జోన్ లలో సరఫరా అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మెగా, ఎల్ & టి ప్రతినిధులు, నగరపాలక సంస్థ ఎస్.ఈ రహంతు జానీ, పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ మహేష్, నగరపాలక సంస్థ ఈ.ఈ. లు అనిల్ కుమార్, చంద్రయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు రఘురాం, ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఈ.ఈ గిరిధర్, డి.ఈ.ఈ. జానకిరామ్ పాల్గొన్నారు.




