Nellore: ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ!
Nellore: నెల్లూరు పప్పులవీధిలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం. కూటమి మేయర్ అభ్యర్థి రూప్‌కుమార్ యాదవ్, 72 మంది కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి.
Nellore: ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ!
Nellore: నెల్లూరు నగరంలోని ఏ డివిజన్‌లో ఏ సమస్య ఉందో క్షణాల్లో గుర్తించగల సామర్థ్యం, నగర పాలనపై పూర్తి అవగాహన, రాజకీయంగా, పాలనాపరంగా విశేష అనుభవం ఉన్న పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్ ని మేయర్‌గా గెలిపించాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజలను కోరారు.
బుధవారం నెల్లూరు పప్పులవీధిలోని ఎస్‌బీఎస్ కల్యాణ మండపంలో నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ గారు పాల్గొని, నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. మేయర్ అభ్యర్థి రూప్‌కుమార్ యాదవ్ తో పాటు కూటమి తరపున పోటీ చేస్తున్న 72 మంది కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్యవైశ్యులు అంటే నమ్మకానికి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తులని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. మాట ఇస్తే నిలబెట్టుకునే మనస్తత్వం ఆర్యవైశ్యుల ప్రత్యేకత అని పేర్కొన్నారు.




