Nellore: ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఎంపీ వేమిరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎన్నికల ప్రచారం!
Nellore: నెల్లూరు 45వ డివిజన్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కూటమి నాయకులు ప్రచారం నిర్వహించారు.
Nellore: ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఎంపీ వేమిరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎన్నికల ప్రచారం!
Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్ ఏ.సీ. సుబ్బారెడ్డి స్టేడియంలో ఎన్నికల ప్రచారంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ కూటమి అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ తో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.
నెల్లూరు నగర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రాబోయే ఎన్నికల్లో నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ని, అలాగే 45వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి చిత్తలూరు సుందర రామిరెడ్డి ని అత్యధిక ఓట్లు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి... ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




