Nellore: నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ రోడ్ షో!
Nellore: నెల్లూరు నగరంలో 'చెప్పాం.. చేస్తున్నాం' ప్రచారంలో భాగంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు డివిజన్లలో రోడ్ షో నిర్వహించి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు.
Nellore: నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ రోడ్ షో!
Nellore: నెల్లూరు నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మరోసారి అండగా నిలవాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం నెల్లూరు నగరంలో నిర్వహించిన ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు డివిజన్లలో రోడ్ షో నిర్వహించి, కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
70, 71, 72వ డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 70వ డివిజన్ టీడీపీ అభ్యర్థి రాచగిరి చంద్రశేఖర్, 71వ డివిజన్ జనసేన అభ్యర్థి ఎస్కే అలియా, 72వ డివిజన్ టీడీపీ అభ్యర్థి షేక్ సల్మాను గెలిపించాలని కోరారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఒకేసారి మూడు డివిజన్లలో రోడ్ షోలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల ముఖాల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పట్ల సంతృప్తి, ఆనందం కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారని తెలిపారు.




