Nellore: నెల్లూరు సిటీలో అత్యధిక స్థానాలు గెలవాలి..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి పిలుపు!

Nellore: నెల్లూరు నగరంలోని 36 డివిజన్లలో మెజారిటీ స్థానాలను గెలుచుకునేలా శ్రేణులు కష్టపడాలని వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 14 Oct 2026 12:05 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు సిటీలో అత్యధిక స్థానాలు గెలవాలి..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి పిలుపు!

Nellore: నెల్లూరు నగరం, నియోజకవర్గ పరిధిలోని మొత్తం 36 డివిజన్ల పరిధిలో మెజారిటీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేలా ప్రతి ఒక్క వైసీపీ నేత కార్యకర్త కష్టపడి పని చేయాలని వైసిపి సిటీ నియోజకవర్గం ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.

నెల్లూరు వైసీపీ సిటీ కార్యాలయంలో ఈ మేరకు వివిధ డివిజన్లకు సంబంధించి వైసిపి ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఎక్కడ అధికార పార్టీ దౌర్జన్యాలు చేసిన అందుకు ప్రతిగా సరైన సమాధానం ఉంటుందన్నారు.

ఎన్నికల నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పై ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయన్నారు. జగనన్న ప్రభుత్వ హాయంలో చేసిన మంచిని, పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ఓటు అడగాలన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE