Nellore: మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

Nellore: గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా మహాత్మా గాంధీకి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. బాపూజీ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

V. Narasimhulu, Nellore
Published on: 2 Oct 2026 5:47 PM IST
Nellore
X

Nellore: మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

నెల్లూరు: వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి..వైసిపి నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్రం కోసం.. బాపూజీ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

ఈ దేశ స్వాతంత్రం కోసం.. ఉప్పు సత్యాగ్రహం, దండియాత్ర ఇలా అనేక పోరాటాలు జరిపి ఈ దేశం నుంచి తెల్లదొరలను తరిమికొట్టి.. భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహానీయుడు మహాత్మా గాంధీ అని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కొనియాడారు. ఆ మహాత్ముని ఆశయాల సాధన దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కృషి చేస్తుందని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాత్ముని ఆశయాలను..నిజం చేసే దిశగా.. గ్రామ స్వరాజ్యం మన హక్కు.. అనే భావనతో గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ సేవలందించే దిశగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి.. ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తీసుకురావడం జరిగిందన్నారు.

రాబోయే రోజుల్లో మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజం చేసే దిగా.. ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore