Nellore: నెల్లూరు 61వ డివిజన్లో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రచారం
Nellore: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 61వ డివిజన్ వైసీపీ అభ్యర్థి వేలూరు మహేష్, మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి గెలుపు కోరుతూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రచారం చేశారు.
Nellore: నెల్లూరు 61వ డివిజన్లో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రచారం
నెల్లూరు: నెల్లూరు సుబేదార్ పేట, బృందావనం ప్రాంతాల్లో.. వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్, MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 61వ డివిజన్ అభ్యర్థి..వేలూరు ఉమా మహేష్ తో కలిసి..ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నక్కలోళ్ళ సెంటర్, బృందావనం ప్రాంతాల్లో.. పలు నివాసాలు,వాణిజ్య దుకాణాలు , హాస్పిటల్స్ కు వెళ్ళి.. ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎప్పుడో అమావాస్య పౌర్ణమి కి ప్రజలను చూసి వెళ్లే నాయకులను కాకుండా, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 61వ డివిజన్ అభ్యర్థి వేలూరు ఉమా మహేష్ ని. వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి ని .. గెలిపించాలని ప్రజలకు చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
గత ఐదు సంవత్సరాలు మహేష్ సారధ్యంలో డివిజన్ ఎంతగానో అభివృద్ధి చెందిందని.. మళ్లీ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
కార్పొరేషన్ లో.. ఇస్టారీతిన పెంచుతున్న ఇంటి పన్నులను నియంత్రించి..డ్రైనేజి,రోడ్లు తాగునీటి సమస్యలను.. సకాలంలో పరిష్కరించేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
అధికారి పార్టీ చేస్తున్న ఆగడాలు, దౌర్జన్యాలు అన్ని ఇన్ని కావని.. వారికి సామాన్య ప్రజల సమస్యలు అవసరం లేదని కేవలం కాంట్రాక్టర్లకు దోచిపెట్టి.. కార్పొరేషన్ ను లూటి చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారని అన్నారు.
ప్రజలకు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలుచేయకుండా .. ఇంటి పన్నులు కట్టలేదని.. పేదలను కోర్టుకిడ్చే.. నీచ స్థితికి కూటమి ప్రభుత్వం దిగజారి పోయిందన్నారు.
ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి.. కార్పొరేషన్ ద్వార ప్రజలకు అన్ని పనులు జరగాలంటే.. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




