Udayagiri: ఉదయగిరిలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విస్తృత పర్యటన

Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విస్తృతంగా ప్రచారం చేశారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 30 Oct 2026 5:35 PM IST
Udayagiri
X

Udayagiri: ఉదయగిరిలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విస్తృత పర్యటన

నెల్లూరు జిల్లా: ఉదయగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర విస్తృతంగా పర్యటించారు. సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో పర్యటిస్తూ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు.

సీతారామపురం మండలం దేవరాజుసూరాయపల్లె గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు చింతల శ్రీను, ఇతర మండల నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరైన బీద రవిచంద్ర, ఏకగ్రీవంగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీపీ సభ్యురాలితో పాటు ఎంపీటీసీ సభ్యులను అభినందించారు. అనంతరం ఉదయగిరి పట్టణంలోని దిలార్ బావి వీధిలో జెడ్పీటీసీ అభ్యర్థి మన్నేటి లక్ష్మితో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

దుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామంలో జెడ్పీటీసీ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి శ్రీకుర్తి లక్ష్మీనారాయణతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వరికుంటపాడు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి మూలే హరితతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీద రవిచంద్ర ఓటర్లను కోరారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI