Kovur: రూ.1.08 కోట్లతో ఉప ట్రెజరీ భవనం: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి!

Kovur: కోవూరు మండల ప్రాంగణంలో రూ.1.08 కోట్లతో నిర్మించిన నూతన ఉప ట్రెజరీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. నాలుగు మండలాలకు సేవలు అందనున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Oct 2026 4:45 PM IST
Kovur
X

Kovur: రూ.1.08 కోట్లతో ఉప ట్రెజరీ భవనం: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి!

కోవూరు: కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండల ప్రాంగణంలో నూతన ఉప ట్రెజరీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆమె మాట్లాడుతూ గతంలో శిథిలావస్థకు చేరిన భవనంలో చాలా ఇబ్బంది గా విధులు నిర్వహించేవారని కోవూరు, కొడవలూరు, విడవలూరు, అల్లూరు మండలాలకు కేంద్రంగా సేవలందిస్తున్న నేపథ్యంలో వారికి నూతన భవనం అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 1.08 కోట్లతో నూతన భవనం మంజూరు చేసి నిర్మాణాన్ని చేపట్టారు.

ఈ నూతన భవనం పెన్షనర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగుల శాలరీ అలవెన్సెస్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి సేవలను నిర్వహించనుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఈ ఆఫీస్ పరిధిలో సుమారు 150 మంది డిడిఓలు పనిచేస్తున్నారని, పెన్షనర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాల సంబంధిత అంశాలపై విధులు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి,మండల కన్వినర్ కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి,ఇంతా మల్లారెడ్డి స్థానిక నాయకులు,ట్రెజరీ ఉద్యోగులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్