Chillakuru: బాధితునికి రూ. 1.76 లక్షల ఎల్‌వోసీ అందజేత
Chillakuru: చిల్లకూరు మండలానికి చెందిన అనారోగ్య బాధితుడు భాస్కర్‌కు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో రూ. 1,76,192 ఎల్‌వోసీ మంజూరైంది.
Chillakuru: బాధితునికి రూ. 1.76 లక్షల ఎల్‌వోసీ అందజేత
చిల్లకూరు: చిల్లకూరు మండలం ఉడతావారిపాలెం గ్రామానికి చెందిన రెకందర్ భాస్కర్ గారు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం KIMS హాస్పిటల్ లో చికిత్స పొందుతూ, ప్రభుత్వం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
వారి పరిస్థితిని తెలుసుకున్న గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి, సత్వరమే LOC మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నారు.దీనిలో భాగంగా ప్రభుత్వం నుండి రూ. 1,76,192/- రూపాయల LOC మంజూరు అయింది. మంజూరైన LOC పత్రాన్ని తాజాగా ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ బాధిత కుటుంబానికి స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...
గూడూరు నియోజకవర్గంలో ఏ ఒక్క పేద కుటుంబానికి ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చినా నేనున్నాననే భరోసా కల్పిస్తాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చూస్తాం.
మన గూడూరు - మన సునీల్ అనే నినాదంతో ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తున్నాం" అని అన్నారు.LOC అందుకున్న రెకందర్ భాస్కర్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.




