Venkatagiri: వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల భారీ రోడ్‌షో
Venkatagiri: వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చైర్‌పర్సన్ అభ్యర్థి దొంతు శారద, 36 వార్డుల కౌన్సిలర్ల తరఫున ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ భారీ రోడ్‌షో నిర్వహించారు.
Venkatagiri: వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల భారీ రోడ్‌షో
వెంకటగిరి: వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ భారీ రోడ్‌షో నిర్వహించారు. వెంకటగిరిలోని కాసిపేట శివాలయం నుంచి పాత బస్టాండ్ వరకు సాగిన ఈ రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రజలకు అభివాదం చేస్తూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని తెలిపారు. పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై, జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తుపై, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు కమలం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. వెంకటగిరి మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వెంకటగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి దొంతు శారద, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




