Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!
Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాళులర్పించారు.
Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!
Nellore: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
అహింస, సత్యం, శాంతి మార్గాల్లో గాంధీజీ చూపిన బాట నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.




